Chusuko Album Song of Yasaswi Kondepudi goes Viral: ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రిగుణ్.. ‘కలియుగం పట్టణంలో’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయుషి పటేల్ కలిసి ‘చూసుకో’ అనే వీడియో ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి ఈ రోజుల్లో ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ సాంగ్స్‌ను కూడా సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం తగ్గకుండడా భారీ ఎత్తున రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక ఆ రిచ్ నెస్ అయితే షాకయ్యేలా ఉంటుంది. ఇక చూసుకో అంటూ సాగే ఈ పాటను యంగ్ సెన్సేషన్ యశస్వి కొండెపూడి, హరిణి ఇవటూరి సంయుక్తంగా ఆలపించారు.
Antony Review: కళ్యాణి ప్రియదర్శన్- ఆంటోనీ రివ్యూ
ఈ పాటకు సాహిత్యాన్ని సురేష్ బాణిశెట్టి అందించగా.. అన్వేష్ రావు కాగితాల బాణీలు సమకూర్చారు. చూసుకో అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళలోని అందమైన ప్రదేశాల్లో షూట్ చేసిన విజువల్స్‌తో మరింత అందంగా చూపించారు. త్రిగుణ్, ఆయుషి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకునేలా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఆయుషి పటేల్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మార్చి 22న కలియుగం పట్టణంలో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరో మూడు ప్రాజెక్టులు చిత్రీకరణలో ఉన్నాయి. మరో వైపు త్రిగుణ్ కూడా పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
