యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన “నన్ను దోచుకుందువటే” చిత్రం భారీ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న నెక్స్ట్ మూవీ “శ్రీదేవి సోడా సెంటర్”. సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, నరేష్, మోనోజిత్ శిల్, అరిపిరాల సత్యప్రసాద్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త సహాయక పాత్రలు పోషిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న “శ్రీదేవి సోడా సెంటర్”కు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ కంపోజర్ మణి శర్మ ఈ డ్రామాకు సంగీతం అందించారు. “శ్రీదేవి సోడా సెంటర్ ఆగస్టు” 27న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచుతున్నారు మేకర్స్.
Read Also : మంచి రోజులొచ్చాయి : “సోసోగా” లిరికల్ వీడియో సాంగ్
అందులో భాగంగానే “శ్రీదేవి సోడా సెంటర్”లోని “చుక్కల మేళం” సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ఈ రోజు ప్రకటించారు. “చుక్కల మేళం” లిరికల్ సాంగ్ హీరో హీరోయిన్ల పెళ్ళికి సంబంధించింది అని మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే అర్థమైపోతోంద. సూరిగాడు తాను ఇష్టపడిన శ్రీదేవిని పెళ్లి చేసుకునే ఆ శుభసందర్భంలో ఈ సాంగ్ వస్తుందన్నమాట. ఈ సాంగ్ ను ఆగష్టు 17న ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.
