Site icon NTV Telugu

Ponniyin Selvan 2: చోళులు వచ్చేసారు… ఈసారైనా నిలబడతారా?

Ponniyin Selvan 2

Ponniyin Selvan 2

మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్ 28 రిలీజ్ కి రెడీ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 500 కోట్లు రాబట్టింది కానీ ఆ కలెక్షన్స్ ఇండియాలోని అన్ని సెంటర్స్ నుంచి వచ్చినవి కావు. తమిళనాడు మినహా మిగిలిన అన్ని సెంటర్స్ లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. తమిళ కథ కావడంతో తమిళ నేటివిటీ ఉండడంతో తమిళేతర ఆడియన్స్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1కి కనెక్ట్ కాలేకపోయారు. ఈ విషయాన్ని మేకర్స్ బాగా అర్ధం చేసుకున్నట్లు ఉన్నారు అందుకే పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2ని ఎక్కువగా తమిళనాడులోనే ప్రమోట్ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఎదో ఒక ఈవెంట్ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్లు ఉంది పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ చూస్తుంటే. అసలు బజ్ క్రియేట్ చెయ్యకుండా, సైలెంట్ గా ఈవెంట్స్ మాత్రమే పెట్టి తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. మొదటి పార్ట్ కే రెండు పార్టులకి పెట్టిన డబ్బులు కూడా వచ్చేయడమే ఇందుకు ఇంకో కారణం కూడా అయి ఉండొచ్చు. అన్ని మేజర్ సెంటర్స్ లో ఒక్కో ఈవెంట్ చేస్తున్న పొన్నియిన్ సెల్వన్ 2 టీం, హైదరాబాద్ కూడా వచ్చేసారు.

ఈరోజు సాయంత్రం 5:30కి నోవోటెల్ హోటల్ పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరి ఈ ఈవెంట్ తో తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా బజ్ ని జనరేట్ చెయ్యగలుగుతారేమో చూడాలి. పొన్నియిన్ సెల్వన్ 2 తెలుగులో బజ్ జనరేట్ చెయ్యలేకపోతే మినిమమ్ ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉంటే పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా నుంచి ‘మిన్నంచు వెన్నెల’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. విక్రమ్, ఐశ్వర్య రాయ్ లపైన ఈ సాంగ్ ని డిజైన్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1లో విక్రమ్-ఐష్ ల లవ్ ట్రాక్ సగమే చూపించారు. చిన్నప్పుడు ప్రేమించుకున్న విక్రమ్-ఐష్ ఎందుకు విడిపోయారు? శత్రువులుగా ఎందుకు మారారు? ఐష్, విక్రమ్ ని చంపడానికి ఎందుకు ప్లాన్ చేస్తుంది? అసలు ఆమె కథ ఏంటి? అరుణ్ మొలిని కాపాడిన కావేరి ఎవరు? ఆమె ఐశ్వర్య లాగే ఎందుకు ఉంది? అనే ప్రశ్నలకి సమాధానం పార్ట్ 2లో ఎలా రివీల్ చేస్తారు అనేది చూడాలి.

Exit mobile version