Site icon NTV Telugu

Vikram: మీరంతా పిచ్చోళ్ళు.. లోకంలో ఎక్కడ లేని రికార్డ్ ఇది

Maxresdefault (5)

Maxresdefault (5)

Vikram: విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లాంటి భారీ తారాగణంతో స్టార్ డైరెక్టర్ మణిరత్నం సృష్టించిన అద్భుత యుద్ధం.. పొన్నియన్ సెల్వన్. ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందు రానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

ఇక ఈ ఈవెంట్ లో విక్రమ్ మాట్లాడుతూ ” అందరికి నమస్కారం.. మీరు తెలుగు ప్రేక్షకులు కాదు.. సినిమా ప్రేక్షకులు.. మీరంతా సినిమా పిచ్చోళ్ళు. నాకు ఒక్కో సినిమాలో ఒక్కో స్పెషల్ ఉంటుంది. నాన్న అంటే ఎమోషన్, శివ పుత్రుడు అంటే ఫైట్.. అపరిచితుడు అంటే పెర్ఫార్మన్స్.. ఇలా ఒక్కో నటుడికి ఒక్కో స్పెషల్ ఉంటుంది. నాకు ఈ సినిమాలో ఒకే ఒక షాట్ ఉంటుంది.. అది చాలు.. అదే ట్రైలర్ చూపించింది.. గుర్రం మీద వస్తున్నా కదా.. ఆ ఒక్క షాట్ చాలు.. ఇంకేమి వద్దు నాకు. అదొక్కటే కాదు ఇలాంటి మంచి తారాగణం తో పనిచేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఏంటి ఈ క్యాస్ట్ లో అంత స్పెషల్ ఏంటంటే.. నాకు తెలిసి ఇదొక రికార్డ్.. లోకంలో ఎక్కడా లేని రికార్డ్.. ఈ సినిమాలో అందరు హీరోలు.. అందరూ హీరోయిన్లే. ప్రకాష్ రాజ్, పార్ధీబన్, జయరామ్.. అందరూ ఒకప్పుడు హీరోలుగా చేసినవారే.. ఎందుకు ఈ సినిమా కోసం అందరం కలిశామంటే.. ఒక్కో పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక దాంతో పాటు మేమందరం కలవడానికి కారణం ఒక్కరు.. మణిరత్నం గారు. నా డ్రీమ్ డైరెక్టర్. నేను ఈ సినిమాలో భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా సినిమాలో పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించాడు.

Exit mobile version