కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఆరోగ్యంపై కావేరీ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శుక్రవారం విక్రమ్ గుండెపోటుకు గురైనట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే.. అయితే ఆయనకు వచ్చింది గుండెపోటు కాదని, ఛాతిలో చిన్నగా నొప్పి ఉండడంతో ఆయనను హాస్పిటల్ కు తీసుకువచ్చారని విక్రమ్ మేనేజర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం కూడా తెల్సిందే.
ఇక తాజాగా కావేరి హాస్పిటల్ యాజమాన్యం విక్రమ్ హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. “ఛాతిలో నొప్పి కారణంగా విక్రమ్ ఆస్పత్రికి వచ్చారు.. నిపుణులైన డాక్టర్లతో ఆయనకు వైద్యం అందించాం.. ఆయనకి ఎలాంటి గుండెపోటు రాలేదు.. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తాం” అని తెలిపారు. ఇక దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విక్రమ్ త్వరగా ఇంటికి రావాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.
