Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కోబ్రా. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎన్నో వాయిదాలను దాటుకొని ఎట్టకేలకు ఆగస్టు 31 న విడుదలకు సిద్దమయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. నేడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో విక్రమ్ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఇక ఇటీవలే విక్రమ్ కు గుండెపోటు వచ్చి, హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే.
తాజాగా ఆ విషయమై విక్రమ్ ఫన్నీ గా స్పందించాడు. పది రోజుల క్రితం మీ హెల్త్ గురించి చాలా వార్తలు వచ్చాయి..అయ్యో ఏమైంది అని మేము అనుకున్నాం.. అసలు ఏం జరిగింది అన్న ప్రశ్నకు విక్రమ్ మాట్లాడుతూ ” అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగోని విషయం నిజమే. ఇక ఈ వార్తలు విన్నాకా నేను నిజంగా అనారోగ్యానికి గురయ్యాను. హిందీలో ఒక రెండు యూట్యూబ్ థంబ్ నెయిల్స్ చూశాన. నా ఫొటోకుమాల పెట్టి, పక్కన ఎన్టీఆర్ ఎదురు ఉన్న ఫోటో పెట్టారు. అసలు ఎన్టీఆర్ ఎందుకు వచ్చాడు. అది చూసి డాక్టర్స్ ను అడిగాను.. అంతా ఓకేనా నేను బాగానే ఉన్నానా అని, ఎన్టీఆర్ ఫొటోస్, ఇవన్నీ చూసినాకే ఐదు రోజులు ఐసీయూ లో ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
