మణికొండలోని చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో ప్లాట్ల కేటాయింపులో 2005 నుంచి 2020 వరకూ జరిగిన అవకతవలపై కమిటీ విచారణ జరిపింది. నవంబర్ 27న తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. అక్రమాలకు సంబంధించి ఫైనల్ రిపోర్టులో 15 మందిని బాధ్యులుగా చేర్చింది. పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో కమిటీ పేర్కొంది. ఫైనల్ రిపోర్టులో పలువురు సినీ పెద్దల పేర్లు ఉన్నాయి.
Also Read: Anupama Parameswaran: 2025 అంటే అనుపమదే.. ముగ్గురు ఫ్లాప్ హీరోలకు లైఫ్ ఇచ్చిందిగా!
గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పలువురు సినీ పెద్దలు కమిటీలో ఉంటూ నిధులు కాజేశారని రిపోర్టులో పేర్కొన్నారు. పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్టులో కీలక అంశాలను డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రస్తావించారు. రూ.43.78 కోట్లు రికవరీ చేయాలని రిపోర్టులో పేర్కొన్నారు. అదనంగా 18 శాతం చెల్లించాలని ఆదేశాలను జారీ చేశారు. నివేదికలో తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్‌తో పాటు పలువురి పేర్లు ఉన్నాయి. డిప్యూటీ రిజిస్ట్రార్ 15 మందికి నివేదిక కాపీని పంపారు.
