NTV Telugu Site icon

Chiru: అతను మాట్లాడింది తప్పు… ఆమెకి నేను అండగా నిలుస్తా…

Chiru

Chiru

కోలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీ ఖాన్ తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమే. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన మన్సూర్ అలీ ఖాన్ ఈమధ్య ఎక్కువ కనిపించలేదు. ఆ గ్యాప్ ని భర్తీ చేస్తూ లియో సినిమాల్లో మన్సూర్ అలీ ఖాన్ కి అవకాశం ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. ఎప్పుడు ఏం మాట్లాడుతాడు? మైక్ చేతిలో ఉంటే ఎలాంటి కామెంట్స్ చేస్తాడో తెలియని మన్సూర్ ఖాన్… హీరోయిన్ త్రిషపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. “విలన్ అవకాశాలే ఇవ్వట్లేదు… లియో సినిమాలో మంచి రేప్ సీన్ ఇచ్చి ఉంటే త్రిషని ఎత్తుకోని పోయి బెడ్ పై పడేసే వాడిని” అంటూ అసభ్యంగా మాట్లాడాడు మన్సూర్ అలీ ఖాన్. ఈ మాటలపై త్రిష ఘాటుగానే స్పందించింది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం త్రిషకి అండగా నిలుస్తూ మన్సూర్ అలీ ఖాన్ మాటలని తప్పుబడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదే విషయంపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించాడు.

” మన్సూర్ అలీ ఖాన్, త్రిషపై చేసిన కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి. హీరోయిన్ అనే కాదు ఏ అమ్మాయిపైన కూడా మన్సూర్ అలీ ఖాన్ అలాంటి కామెంట్స్ చేయకూడదు. త్రిషకి నేను అండగా నిలుస్తాను” అంటూ చిరు ట్వీట్ చేసాడు. “My attention was drawn to some reprehensible comments made by actor Mansoor Ali Khan about Trisha. The comments are distasteful and disgusting not just for an Artiste but for any woman or girl. These comments must be condemned in the strongest words. They reek of perversion. I stand with @trishtrashers and every woman who has to be subject to such horrid comments” చిరు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments