NTV Telugu Site icon

Unstoppable 3: బాలయ్య మొదటి గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి… రాసిపెట్టుకోండి ఇది బిగ్గెస్ట్ సెన్సేషనల్ ఎపిసోడ్ అవుతుంది

Unstoppable 3

Unstoppable 3

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. సినిమాల పరంగా ప్రత్యర్దులుగా ఉన్న చిరు బాలయ్యలు బయట మంచి స్నేహితులుగానే కనిపిస్తారు. కలిసి కనిపించడం అరుదే కానీ కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. చిరు పెద్ద కూతురి పెళ్లిలో బాలయ్య చేసిన డాన్స్, బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా చిరు రావడం లాంటి సందర్భాలని మెగా నందమూరి అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. టాలీవుడ్ కి పిల్లర్స్ లాంటి చిరంజీవిని బాలకృష్ణని ఒకే వేదికపై చూసే అవకాశం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. అలాంటి అరుదైన అవకాశం ఇప్పుడు మెగా నందమూరి అభిమానుల ముందుకి రాబోతుంది.

చిరు బాలయ్యల అపూర్వ కలయికకి వేదిక కానుంది ‘అన్ స్టాపపబుల్’ టాక్ షో. రెండు సీజన్స్ ముగించుకోని ఇక సీజన్ 3 ఉండదేమో అనుకుంటున్న సమయంలో సీజన్ 3 అనౌన్స్మెంట్ బయటకి వచ్చి కిక్ ఇచ్చింది. ఈ సీజన్ 3 లిమిటెడ్ ఎడిషన్ లో బాలయ్యకి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నాడని సమాచారం. దసరా రోజున అన్ స్టాపబుల్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో కూడా బయటకి రానుందట. టాలీవుడ్ పిల్లర్స్ గా ఉన్న చిరు బాలకృష్ణలు ఎదురెదురు కూర్చోని తమ సినిమాల గురించి మాట్లాడుకుంటే, సినీ అభిమానులకి అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది. టెలివిజన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సక్సస్ కాబోయే ఎపిసోడ్ త్వరలో బయటకి రానుంది. ఆరోజు మాస్ మూల విరాట్ అండ్ గాడ్ ఆఫ్ మాసెస్ కలిస్తే చాలు ఆహా యాప్ సర్వర్లు బద్దలైపోవాల్సిందే.