NTV Telugu Site icon

Chiranjeevi: మెగా ఫ్యాన్స్ ఆ డైరెక్టర్ ను వదిలేయండయ్యా.. చిరుతో సినిమా లేదంట..

Vasista

Vasista

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ వయస్సులో కూడా చేతిలో వరుస సినిమాలు పెట్టుకొని కుర్ర హీరోలకు గుబులు పుట్టిస్తున్నాడు. ఈ ఏడాది మొదటిలోనే వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం చిరు, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తరువాత ఒక తమిళ్ డైరెక్టర్ తో చిరు సినిమా ఉంటుంది అంటున్నారు. ఇకపోతే గత కొన్నిరోజులుగా చిరు.. కుర్ర డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరు ఒక సినిమా చేస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Samantha: మాజీ భర్తను మర్చిపోయినా.. మరిదిని గుర్తుపెట్టుకొని మరీ విష్ చేసిందే

బింబిసార చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేశాడు వశిష్ఠ. కళ్యాణ్ రామ్ తో కలిసి పీరియాడిక్ డ్రామా తీసి అందరిని మెప్పించాడు. చిరు సైతం అతడిని అభినందించాడు. అదుగో అక్కడే మొదలయ్యింది ఈ గొడవంతా. చిరు, వశిష్ఠను కలవడంతో చిరుకు, అతను కథను రాస్తున్నాడని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు, నెటిజన్లు ఏవేవో పుకార్లు సృష్టించారు. దీంతో మెగా అభిమానులు, వశిష్ఠను ఊపిరి సల్పనివ్వడం లేదంట. ఎక్కడకు వెళ్లినా చిరుతో సినిమా.. అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ చెప్పుకొస్తున్నారట. దీంతో సదురు డైరెక్టర్ కొద్దిగా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ వార్తల్లో నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ పుకార్లు అన్ని అవాస్తవమట. చిరుతో తన నెక్స్ట్ సినిమా ఏం ప్లాన్ చేయడంలేదని వశిష్ఠ అందరికి క్లారిటీ ఇచ్చాడట. అసలు ఇప్పటివరకు అతడు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. బింబిసార పార్ట్ 2 ప్లాన్ చేసే ఉద్దేశంలో ఉన్నాడని అంటున్నారు. మరి ఇప్పుడైనా ఈ డైరెక్టర్ ను వదిలేయండయ్యా.. అంటూ మెగా ఫ్యాన్స్ కు చెప్పుకొస్తున్నారు నెటిజన్లు.. మరి వశిష్ఠ తన నెక్స్ట్ సినిమా ఎవరితో ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.

Show comments