NTV Telugu Site icon

Chiranjeevi: ‘భోళా శంకర్’ పూర్తి.. అమెరికా వెకేషన్‌కు మెగాస్టార్

Chiranjeevi Heading To A Vacation

Chiranjeevi Heading To A Vacation

Chiranjeevi’s Vacation trip to New York: మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోలా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌ విడుదల కాగా ఆ టీజర్లో తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపించారు చిరంజీవి. ఇక తాజాగా ఈ భోళా శంకర్‌ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని మెహర్ రమేష్ అధికారికంగా ప్రకటించారు. భోళా శంకర్ షూట్ పూర్తయింది, రాత్రి పగలు విరామం లేకుండా పని చేస్తున్న నటీనటులు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌తో జరుగుతున్నాయి, ప్రమోషన్లు మొదలు పెడతాం, ముందుగా పాటలు విడుదల కాబోతున్నాయని ఆయన రాసుకొచ్చారు. ఇక భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని మెహర్ రమేష్ ట్వీట్ చేశారు. ఇక అదే సమయంలో “భోళా శంకర్” షూట్ పూర్తయినందున, చిరంజీవి ఇప్పుడు తన పర్సనల్ టైం స్పెండ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్రారంభించడానికి ముందు ఆయన న్యూయార్క్ వెళ్లాలనుకుంటున్నారని సతీసమేతంగా అక్కడికి వెళ్లి ఆయన వెకేషన్ ఎంజాయ్ చేయనున్నారని అంటున్నారు.

Balagam Movie: ‘బలగం’కు మరో అరుదైన రికార్డు.. ఏకంగా 100 ఇంటర్నేషనల్ అవార్డులు

ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది, ఇక మిగిలిన పాటలు ఒకదాని తర్వాత ఒకటి విడుదవనున్నాయి. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ చిత్రానికి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ బ్యానర్ మీద రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర చిత్రాన్ని నిర్మిసున్నారు. డడ్లీ డీవోపీగా పని చేస్తున్న ఈ సినిమాకి సత్యానంద్ కథ పర్యవేక్షణ అందిస్తుండగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Show comments