Chiranjeevi wishes to Satyanarayana!
ప్రముఖ నటులు సత్యనారాయణ పుట్టిన రోజు ఇవాళ. కొంతకాలం క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన సత్యనారాయణ ఆ తర్వాత కాస్తంత కోలుకున్నారు. ప్రస్తుతం ఇంటిలోనే ఆయనకు చికిత్స జరుగుతోంది. ఇవాళ ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్ళారు. బెడ్ పై విశ్రాంతి తీసుకుంటున్న సత్యనారాయణతో కేక్ కట్ చేయించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దానికి సంబంధించిన ఫోటోలనూ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
