మెగాస్టార్ చిరంజీవి జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసారు. చిరు తన పెరట్లో కొన్ని నెలల క్రితం పొట్లకాయ విత్తనాలను నాటగా, అది పెరిగి, ఇప్పుడు పొట్లకాయలు కూడా అయ్యాయట. దీంతో చిరు తాను నాటిన విత్తనం పెరిగి, ఆ తీగకు కాసిన పొట్లకాయలను చూసి ఆనందంలో మునిగిపోయారు. తెల్లటి చొక్కా ధరించి, చిరు తన గార్డెన్ నడవలో నడుస్తూ సెల్ఫీ వీడియోలో కనిపించారు. చిరు తన ఫేవరెట్ అవుట్‌డోర్ యాక్టివిటీ, గార్డెనింగ్… చేతిలో తాజా పొట్లకాయలు పట్టుకుని చిరు ఆనందంతో రైతులకు సెల్యూట్ చేశారు. “పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి! అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు కి నా సెల్యూట్” అంటూ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Also :
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఇక ఆ తరువాత భోళా శంకర్, గాడ్ ఫాదర్, కె ఎస్ రవీంద్రతో మరో ప్రాజెక్ట్ తో చిరు బిజీగా ఉన్నారు.
A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)
