Site icon NTV Telugu

Chiranjeevi : ఆమె మృతి నన్ను కలచివేసింది.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్టు

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్టు చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ మెహెర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. రమేశ్ సోదరి సత్యవతి ఈ రోజు మృతి చెందారు. దాంతో సినీ ప్రముఖులతో పాటు చాలా మంది ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సంతాపం తెలిపారు. ‘తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి తనకు కూడా సోదరిలాంటిదే అన్నారు. ఆమె మృతి చెందడం తనను ఎంతో కలిచి వేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి.

Read Also : Dhanraj : 15 ఏళ్లకే పెళ్లి.. ఆ సినిమాతో సర్వం కోల్పోయాంః ధన్ రాజ్ భార్య

మెహెర్ రమేశ్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న తనం నుంచే మెహెర్ రమేశ్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. వారిద్దరి కుటుంబాలు చిన్న వయసులో ఒకే దగ్గర విజయవాడలో ఉండేవి. చిన్నప్పుడు మెహెర్ రమేశ్ తో పాటు ఆమె సోదరితో పవన్ కల్యాణ్‌ సరదాగా గడిపానని తెలిపారు. పవన్ కూడా సత్యవతి మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Exit mobile version