Chiranjeevi To Remake Another Tamil Movie: గతంతో పోలిస్తే.. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. రీమేక్ సినిమాలను ప్రేక్షకులు ఏమాత్రం ప్రోత్సాహించడం లేదు. ఓటీటీ పుణ్యమా అని ఒరిజినల్ వర్షన్స్‌లోనే ప్రేక్షకులు సినిమాలను చూసేస్తున్నారు. అందుకే.. స్టార్ హీరోలందరూ ఒరిజినల్ కథలతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. అది హిట్ అవుతుందా? బోల్తా కొడుతుందా? అనే సంగతులు పక్కనపెడితే.. ఒరిజినల్‌లో ఒక ప్రత్యేకమైన క్యూరియాసిటీ ఉంటుందని, రీమేక్‌లో అలాంటి భావన ఉండటం లేదని చెప్తున్నారు. ఆల్రెడీ చూసేసిన సినిమానే రీమేక్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
Bride Ride In The Metro: పెళ్లి కూతురు స్మార్ట్ ఛాయిస్.. వైరల్‌గా మారిపోయింది..
ప్రజల్లో రీమేక్ చిత్రాలపై ఇంత వ్యతిరేకత ఉన్నా.. మన హీరోలు మాత్రం రీమేక్ చిత్రాలను ఒక సవాల్‌గా తీసుకొని, వాటిని చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి రెండు రీమేక్‌లు (ఖైదీ నం.150, గాడ్‌ఫాదర్) చేసేశారు. వాల్తేరు వీరయ్యలాంటి ఫ్రెష్ సబ్జెక్ట్‌తో అభిమానులను అలరించిన ఆయన.. భోళా శంకర్ (వేదాళం) అనే మరో రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఆయన మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. తమిళంలో మంచి విజయం సాధించిన ‘విశ్వాసం’ సినిమాని చిరంజీవి తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. 2019లో విడుదలైన ఆ సినిమాలో అజిత్ కుమార్ కథానాయకుడిగా నటించారు. ఈ తెలుగు రీమేక్‌కు దర్శకుడు వివి వినాయక్ మెగాఫోన్ పట్టనున్నాడట! అయితే.. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.
Shahrukh Khan: అసెంబ్లీ స్పీకర్ సవాల్.. చేసి చూపించిన షారుఖ్ ఖాన్
ఒకవేళ ఇది నిజమే అయితే.. అభిమానులు మాత్రం బ్యాడ్ న్యూసే అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ విశ్వాసం సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. టీవీలలో కూడా చాలాసార్లు ప్రసారం అయ్యింది. ఆల్రెడీ తెలుగు ఆడియెన్స్ చూసేసిన సినిమా కాబట్టి.. కచ్ఛితంగా ఈ రీమేక్‌పై ఆసక్తి అంతగా ఏర్పడకపోవచ్చు. అందుకే.. చిరుని ఈ సినిమా చేయొద్దని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ రిక్వెస్టులు చేస్తున్నారు. ఈ రీమేక్ బదులు వాల్తేరు వీరయ్య తరహాలోనే ఫ్రెష్ కథలతో సినిమాలు చేయాల్సిందిగా కోరుతున్నారు. మరి, ఫ్యాన్స్ కోరిక మేరకు చిరు ఈ రీమేక్ నుంచి డ్రాప్ అవుతారా? లేక చేస్తారా? అనేది చూడాలి.
Varun Tej: వరుణ్ తేజ్ నెక్ట్స్ టైటిల్ రివీల్.. అదిరిందయ్యా ‘అర్జున’