తెలుగులో యంగ్ డైరెక్టర్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల మరోసారి చిరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో నితిన్ – శ్రీ లీల జంటగా రూపొందించిన ‘రాబిన్ హుడ్’ (మార్చి 28, 2025) పెద్ద రెస్పాన్స్ పొందలేకపోవడంతో, వెంకీ ఈసారి మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేక కథ రాశాడు.
Also Read : Balakrishna : ‘NBK111’ కోసం గోపీచంద్ మలినేని హై యాక్షన్ ప్లాన్..
తాజా వివరాల ప్రకారం, ఈ కథలో ముదురు జంట ప్రేమలో పడుతుంది, కానీ తమ పిల్లలకు తెలియకుండా రహస్యంగా తమ ప్రేమను కొనసాగించే సందర్భాలు చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి మధ్య వయస్కుడిగా కనిపిస్తారని, అతని పాత్ర ఎమోషనల్, హాస్యంతో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక చిరుకి జోడిగా హీరోయిన్ పాత్రకు సంబంధించి కూడా ఫ్యాన్స్‌కు పెద్ద ఎక్సైటింగ్ ఉన్నారు. ఇప్పటికే అనుష్క లేదా త్రిష ఈ పాత్రలో నటించవచ్చని ప్రచారాలు ఉన్నాయి. అయినప్పటికీ, మేకర్స్ ఇప్పటివరకు ఏ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇక చిరు కామెడీ టైమింగ్ గురించి మనకు తెలియంది కాదు. మెగాస్టార్ యాక్టివ్‌గా సినిమాలు చేస్తూ ఉన్నందున, ఈ కామెడీ ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్ స్టేజ్‌కి చేరే అవకాశం ఉంది.
