సమానత్వానికి ప్రతీకగా హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో నిర్మించిన సమతామూర్తి భారీ విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి తాజాగా సందర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “భీష్మ ఏకాదశి రోజున అనుకోకుండా ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గత నాలుగు రోజులుగా రావాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కుదిరింది. నేను దీని గురించి విన్నాను… కానీ చుశాకనే ఎంత అద్భుతం అనేది అర్థమైంది.
Read Also : Posani : పరుచూరి బ్రదర్స్ లా మాత్రం బతకొద్దు అనుకున్నా…
ఆవిష్కరణ రోజు ప్రధాన మంత్రి మోడీ ఇది ప్రపంచంలోని 8వ వింత అంటే ఏదో కష్టపడిన వారికి ప్రశంసలు అనుకున్నాను. కానీ ఇప్పుడు చూశాక అదే మాటను వెంకయ్య నాయుడు గారు నొక్కివక్కాణించడం అక్షర సత్యం. చిన్న జీయర్ స్వామి గారి మస్తిష్కంలో ఈ దివ్యసంకేతం గురించి ఎప్పుడు ఉదయించి, ఉద్భవించిందో… మిత్రులు జూపల్లి రామేశ్వరరావు గారు మాత్రమే ఇది సాధించగలరు అని ఆయనకు ఆ బాధ్యతను అప్పగించడం ఆరేళ్ళ క్రితం జరిగింది” అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
