Site icon NTV Telugu

Chiranjeevi: వారందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా!

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi Speech at AHA-PMF SIFF: ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించిన’ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ (SIFF) ఇనాగరల్ ఎడిషన్‌ వేడుక ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ, R &B మంత్రి కోమట్‌రెడ్డి వెంకట్ రెడ్డి, ఆహా కో ఫౌండర్ అల్లు అరవింద్, మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్ మేఘన జూపల్లి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్, అజిత్ ఠాకూర్, ఆహా సిఇఒ రవికాంత్ సబ్నవిస్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి వంటి ప్రముఖులచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.ఇక పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ క్రమంలో మురళీ మోహన్, ఇటీవల పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్న చిరంజీవిని సత్కరించారు. ఇక ఈ వేడుకలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఆహా ఏర్పాటు చేసిన ఈ వేడుకకు రావడం చాలా ఆహ్లాదకరంగా ఉందన్నారు. ఐదారు రోజులు పాటు ఒక సంబరంలా వేడుక జరిగిందనే ఆనందం నాకు వుంది. ప్రతి కళాకారుడికి సామాజిక బాధ్యత ఉంటుంది.

Anjali: నిర్మాతతో హీరోయిన్ అంజలి పెళ్లి?

ప్రేక్షకులు మనకు పంచిన ప్రేమకు బదులుగా మనం ఏమి తిరిగి ఇస్తున్నామని ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రజా సేవకుడు అవుతారు, సమయానికి రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని పత్రికల్లో చదివినప్పుడు మనసు కలిచివేసింది. సమయానికి రక్త ఇచ్చినట్లయితే ఒక ప్రాణం నిలబెట్టిన వారం అవుతారు కదా అనే ఆలోచనతో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. నా అభిమానుల మీద నమ్మకంతో అది పెట్టా, ఈ రోజుకీ నిరంతరంగా అది కొనసాగుతుందంటే కనుక అభిమానులు వల్ల సాధ్యపడుతుంది. ఈ సందర్భంగా వారందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన సమయంలో అదే ఆదరణ ప్రేమ ఉంటుంద ? అనే ఆలోచన వుండేది. నా సినిమాలో డైలాగ్ ఒకటి ఉంది. ‘ఎన్నాళ్ళైనా అదే పౌరుషం, అదే రక్తం’. ఇదే డైలాగ్ నేను తిరిగి సినిమాల్లోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు నాకు చెప్పినట్లునిపించింది.’అదే ఆదరణ, అదే ప్రేమ, అదే అభిమానం, అదే గుండెల్లో మీ చోటు” అన్నట్టుగా అనిపించింది. 150 సినిమా నుంచి ఈ క్షణం వరకు అదే ఎనర్జీ పొందుతున్నాను. ప్రేక్షకుల స్పందన, అభిమానమే ఎనలేని ఉత్సాహాన్నీ ఇస్తున్నాయి. ఓపిక ఉన్నంత వరకు, మీరు ఆదరించేవరకూ సినిమాల్లో వుంటాను అని అన్నారు.

Exit mobile version