Site icon NTV Telugu

Chiranjeevi: చిరంజీవి షాకింగ్ డెసిషన్.. ఆందోళనలో ఫ్యాన్స్..?

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్రహీరోలకు పోటీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే చిరు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. వరుస సినిమాలు చేస్తూనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నాడట.. త్వరలో ఒక వెబ్ సిరీస్ లో చిరు నటించబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకులందరూ థియేటర్స్ కన్నా ఓటిటీ వైపే మొగ్గుచూపుతున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంట్లోనే చూడొచ్చు అనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు ఓటిటీలకే ఓటు వేస్తున్నారు.

ఇక ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకుంటున్న స్టార్ హీరోలు సైతం ఓటిటీలో సినిమాలకు, వెబ్ సిరీస్ లకు సై అంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు చిరు సైతం అదే ఫార్ములాలో వస్తున్నారట. ఇప్పటికే రెండు ప్రముఖ ఓటిటీ సంస్థలను చిరు సంప్రదించడం, ఒక కొత్త కంటెంట్ ను తన కోసం క్రియేట్ చేయమని చెప్పడం జరిగినట్లు వినికిడి. అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న చిరు సడెన్ డెసిషన్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా కథల విషయంలోనే చిరు కొంచెం అటుఇటుగా ఉన్నారు. ఇటీవలే రిలీజైన ఆచార్య నే అందుకు నిదర్శనం. అలాంటిది చిరు ఓటిటీ ఎంట్రీ అంటే మాటలు కాదు. ఆయనకు తగ్గ కథ కావాలి. అలాంటి కథ దొరికి, చిరు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం అంటే ఆషామాషీ కాదు. చిరు డిజిటల్ ఎంట్రీ త్వరగా ఇవ్వడం కోసం ఏ కథను పడితే ఆ కథను ఎంచుకొని అక్కడ కూడా పరాజయాన్ని చవిచూస్తారేమోనని భయపడుతున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉంది అని తెలియాలంటే చిరు నోరువిప్పక తప్పదేమో..

Exit mobile version