Site icon NTV Telugu

Chiranjeevi: డబ్బు ఖర్చు చేస్తేనే రిచ్ నెస్ రాదు.. తెలుగు డైరెక్టర్లకు చిరు చురకలు

Megastar

Megastar

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఏ ఈవెంట్ కు వెళ్లినా ఆయన ఏం మాట్లాడతారో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఎక్కడకు వెళ్లినా కూడా చిరు చిత్ర పరిశ్రమ గురించి, డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. తాజాగా చిరు మరోసారి డైరెక్టర్లకు చురకలు అంటించారు. డబ్బు ఖర్చు చేస్తేనే రిచ్ నెస్ రాదని, డైరెక్టర్ల ఆలోచన నుంచి ఆ రిచ్ నెస్ వస్తుందని చెప్పడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. ఇక గతరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో చిరు.. డైరెక్టర్ శక్తి గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్ డైరెక్టర్స్ కు చురకలు అంటించారు.

” రాజస్థాన్ నుంచి వచ్చిన శక్తి ప్రతాప్ సింగ్ లో మంచి టాలెంట్ ఉంది. తెలుగులో అవకాశాలు వుంటాయి, మంచి పారితోషికం ఉంటుందని, కమర్షియల్‌ డైరెక్టర్‌గా స్థిరపడిపోవచ్చనే ఉద్దేశంతో దర్శకుడు శక్తి ప్రతాప్‌ ఇక్కడకు రాలేదు. తన సొంత ఖర్చుతో దాదాపు ఐదు లక్షలు ఖర్చు చేసి సర్జికల్‌ స్ట్రైక్‌పై షార్ట్‌ ఫిల్మ్‌ తీశాడు. ఇండియన్‌ ఎయిర్స్‌ ఫోర్స్‌ అది చూసి ఆశ్చర్యపోయింది. ఈసారి సినిమా తీస్తే మరింత సమాచారం మేమిస్తామని అధికారులు ఆయన్ను ప్రోత్సాహించారు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ కంటెంట్ ని అద్భుతంగా తీశాడు. సోనీ పిక్చర్స్ కలసి చాలా గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మించారు. సినిమా అద్భుతంగా వచ్చిందని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి సినిమాలు ఆడాలి. ముఖ్యంగా యూత్ చూడాలి. ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు దేశభక్తి ఉప్పొంగుతుంది. రియల్ హీరోస్ కి ఒక సెల్యూట్ గా ఈ సినిమా మనమందరం చూసి తీరాలి. ఈ చిత్రాన్ని 75 రోజుల్లో చిత్రీకరించారు. రిజనబుల్ బడ్జెట్‌లో ఇలాంటి విజువల్స్‌, రిచ్ నెస్ ఇవ్వడం ఆషామాషీ విషయం కాదు. డబ్బు ఖర్చు చేస్తేనే రిచ్ నెస్ రాదని, డైరెక్టర్ల ఆలోచన నుంచి ఆ రిచ్ నెస్ వస్తుంది. ఈ విషయంలో సినిమా విడుదలకు ముందే దర్శకుడు శక్తి సక్సెస్‌ అయ్యారు. అతి తక్కువ బడ్జెట్ లో హై రిచ్ సినిమాలు తీయడం ఎలానో శక్తిని చూసి అందరూ నేర్చుకోవాలి” అని చెప్పుకొచ్చరు. ప్రస్తుతం చిరు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే చిరు ఏ డైరెక్టర్ ను ఉద్దేశించి మాట్లాడారో అని అభిమానులు ఆరాతీయడం మొదలుపెట్టారు.

Exit mobile version