Site icon NTV Telugu

Chiranjeevi: ఆ స్థలాన్ని అమ్మేసిన చిరు.. కారణం ఏంటి..?

Untitled 1

Untitled 1

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. కుర్రహీరోలకు ధీటుగా చిరు వరుస సినిమాలను లైన్లో పెట్టి రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఇటీవలే ఆచార్య పరాజయం అందుకోవడంతో మెగా ఫ్యాన్స్ అందరు తదుపరి సినిమా గాడ్ ఫాదర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. చిరు ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కోట్లల్లో చిరుకు ఆస్తులు ఉన్నట్లు తెల్సిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరు తనకు సంబంధించిన స్థలాన్ని అమ్మేసినట్లు టాక్ నడుస్తోంది.

చిరంజీవి కెరీర్ మొదట్లో ఫిల్మ్ నగర్ లో కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో దాని విలువ సుమారు 30 లక్షలు. ఇప్పటికీ ఆ స్థలం చిరు పేరుమీదనే ఉంది. ఇక ఈ స్థలాన్ని మెగాస్టార్ ఒక వారం రోజుల క్రితం అమ్మేసినట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు ఆ స్థలం విలువ రూ. 70 కోట్లని సమాచారం. అయితే ఈ స్థలం అమ్మడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కొంతమంది ఆచార్య నష్టాల వలన అంటుంటే.. మరికొంతమంది మంచి ధర పలకడంతోనే స్థలం అమ్మేసి ఉంటారు అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం చిరు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Exit mobile version