NTV Telugu Site icon

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసా

Chiranjeevi Golden Visa

Chiranjeevi Golden Visa

Chiranjeevi receives The Golden Visa from the UAE government: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవికి తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా ఇచ్చింది. ఎమిరేట్స్ ఫస్ట్ సంస్థ ద్వారా ఈ గోల్డెన్ వీసా ఇచ్చినట్టు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు, బాలీవుడ్ సహా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలకు కూడా UAE ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది, తలైవా రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సానియా మీర్జా, సల్మాన్ ఖాన్, బోనీ కపూర్, జాహ్నవి కపూర్, రణవీర్ సింగ్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, మౌని రాయ్, మోహన్ లాల్ వంటి వారికి కూడా UAE ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది.

Shah Rukh Khan: షారుఖ్ వాచ్ ధరతో హైదరాబాద్లో లగ్జరీ విల్లా కొనచ్చు తెలుసా?

UAE ఎవరికి గోల్డెన్ వీసా ఇస్తుంది?
యుఎఇ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించే లక్ష్యంతో అనేక పథకాలను ప్రారంభించింది. ఈ పథకాలలో గోల్డెన్ వీసా ఒకటి. ఈజీగా అర్ధం అయ్యేలా చెప్పాలంటే, గోల్డెన్ వీసా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, వైద్య నిపుణులు, సైన్స్ మరియు జ్ఞానంతో అనుబంధించబడిన వ్యక్తులు, కళాకారులు UAEలో ఎక్కువ కాలం స్థిరపడటానికి లేదా అక్కడ ఉండడానికి అనుమతిస్తుంది. ఈ వీసా పథకం 2019 సంవత్సరంలో ఫోర్స్ లోకి తెచ్చారు. అప్పటి నుంచి అమలులోనే ఉంది. ఈ వీసా 5 నుండి 10 సంవత్సరాల వరకు జారీ చేయబడుతుంది. ఇందులో వీసా హోల్డర్‌కు ప్రత్యేకాధికారాలు ఇస్తారు. ఈ వీసా ప్రధానంగా వైద్యులు, శాస్త్రవేత్తలు, సంస్కృతి మరియు కళాకారులు, క్రీడాకారులు, డాక్టరల్ డిగ్రీ హోల్డర్లకు ఇవ్వబడుతుంది. ఈ వీసాలో వీసా హోల్డర్‌కు దీర్ఘకాలిక నివాసం అనుమతించబడుతుంది.

Show comments