Site icon NTV Telugu

Karur rally : కరూర్ ర్యాలీ తొక్కిసలాటపై చిరంజీవి స్పందన..

Chiranjeevi Reacts To Karur Rally

Chiranjeevi Reacts To Karur Rally

తమిళనాడు కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తీవ్ర ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ హీరో విజయ్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ప్రేక్షకులు తొక్కిసలాటకు గురై కొందరు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన పై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో తొక్కిసలాట చాలా విషాదకరం. ఈ విషయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి” అని అన్నారు. వీటితో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రతలు పాటించకుండా జరిగిన ఈ ర్యాలీ ఘటన, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఉదాహరణ.

Exit mobile version