NTV Telugu Site icon

నటుడు ఉత్తేజ్‌ను పరామర్శించిన చిరు, ప్రకాష్ రాజ్

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.

ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. ఉత్తేజ్‌కి చెందిన వస్త్ర వ్యాపారాన్ని కూడా పద్మావతి నిర్వహించేవారు. ఉత్తేజ్‌ చేసే పలు సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగం పంచుకునేది. ఉత్తేజ్- పద్మావతి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు వున్నారు.

నటుడిగానే గాక రచయితగా ఎంతో టాలెంట్ ఉన్న ఉత్తేజ్.. పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి ఆ తర్వాత నటుడిగా మారారు.

ఈ విషాద విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాశ్‌రాజ్‌, జీవిత రాజశేఖర్‌ ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్‌ని పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

Show comments