Chiranjeevi Photos at Karthika Nayar Marriage Goes Viral: నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాలో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు కార్తీక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక ఎందుకో పెద్దగా అవకాశాలు సాధించలేక పోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేక పరిశ్రమలో నిలబడలేక పోయింది. తెలుగులో లాంచ్ అయినా తమిళంలో పలు చిత్రాల్లో నటించిన కార్తీక రంగం సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ సొంతం చేసుకుంది. ఇక ఆ తరువాత తెలుగులో ఎన్టీఆర్ సరసన దమ్ము సినిమాలో కూడా నటించి మెప్పించింది, ఆ సినిమా హిట్ కాకపోవడంతో తెలుగులో ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. సినిమాలు మానేసి ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయిన కార్తీక తాను ప్రేమించి రోహిత్ మీనన్ తో మూడు ముళ్లు వేయించుకుని.. ఏడడుగులు వేసింది.
Calling Sahasra: సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ వివాహానికి అలనాటి తారలంతా హాజరయ్యి కొత్త జంటకి తమ ఆశీస్సులు అందించారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి.. తదితరులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. చాలా కాలం తరువాత వీరు కలవడంతో అంతా కలిసి ఫోటోలకు ఫోజులివ్వగా ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పెళ్ళిలో చిరంజీవి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కార్తీక తల్లి రాధ తన కెరీర్ లో మెగాస్టార్ తో ఎక్కువ సినిమాలు చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి సరసన అత్యధిక సినిమాల్లో నటించిన రికార్డ్ కూడా సాధించింది.