Site icon NTV Telugu

Vyooham: వర్మ ‘వ్యూహం’లో చిరు, పవన్.. ‘అల్లు’ వారిని కూడా వదలలేదుగా!

Ram Gopal Varma Vyooham Mov

Ram Gopal Varma Vyooham Mov

Chiranjeevi, Pawan Kalyan in Vyooham Movie: ఒకప్పుడు తెలుగులో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం వివాదాస్పద సినిమాలకు మాత్రమే పరిమితం అవుతున్నాడు. నిజానికి గత ఐదేళ్ల వ్యవధిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రల్ని పేరడీ చేస్తూ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేశారు కానీ అవి పెద్దగా జనాలకు కనెక్ట్ అవలేదు. అయితే ఇప్పుడు జగన్ ను హైలెట్ చేస్తూ ‘వ్యూహం’ అనే సినిమా అనౌన్స్ చేయడం, ఆ అనౌన్స్ చేసిన తరువాత సీఎం జగన్ ని రెండుసార్లు వర్మ కలవడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇందులో ఏదో కొత్తగా చూపించారనే అంచనాలు ఉండగా ఈ మధ్య విడుదలైన టీజర్ చూస్తే మాత్రం ఆ అంచనాలను నిలబెట్టుకోవడం కష్టమేనని తేలింది.

Jabardasth apparao: బ్రతికి ఉండగానే చంపొద్దు.. ఇంత దిగజారాలా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన దగ్గర్నుంచి మొదలయ్యే ఈ సినిమాలో వైఎస్ఆర్ వరకు అందుబాటులో ఉన్న ఆయన ఒరిజినల్ వీడియోలను వాడుకున్నారు. ఆ తర్వాత మిగతా పాత్రలకు వారికి సరిపోయే పాత్రధారులని తెర మీదకు తీసుకు రాగా జగన్, భారతి, విజయమ్మ, అంబటి రాంబాబు, రోశయ్య.. తదితర పాత్రలన్నీ కనిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ ఫొటో బ్యాక్ డ్రాప్ గా వాడుకుంటూ చంద్రబాబు సహా మరికొన్ని పాత్రలను కూడా పరిచయం చేశారు వర్మ. జగన్ దగ్గరకు అధిష్టానం దూతలు రావడం, సీబీఐ కేసులు, అరెస్టులు, ఆ తర్వాత జగన్ రాజకీయ నేపథ్యం అనే విధంగా సాగింది ఈ టీజర్. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ లను కూడా భాగం చేస్తున్నట్టు చూపించారు. ఇక అందుకు సంబంధించి ఒక ఫోటో షేర్ చేయగా అందులో అల్లు అరవింద్ కూడా కనిపిస్తున్నారు. వైఎస్ మరణానంతరం అప్పటి వరకు స్వతంత్ర పార్టీగా ఉన్న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు.

Exit mobile version