మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు పోటిగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే “మన శంకర వరప్రసాద్ గారు” అనే మూవీ చేస్తుండగా, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న నెక్స్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే “మెగా 158”గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్కో అప్‌డేట్ బయటకు వస్తున్నకొద్దీ ఆసక్తి పెరుగుతోంది. ఇక తాజా..
సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్-యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించబోతున్నారట. అది కూడా విలన్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ‘మహారాజ’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టిన అనురాగ్, ఇప్పుడు ఈ సినిమాతో టాలీవుడ్‌లో కూడా తన స్ట్రాంగ్ మార్క్ వేయాలని చూస్తున్నాడు. అనురాగ్ కశ్యప్ నటనలో ఉండే రియలిస్టిక్ లుక్ కారణంగా, ఆయన విలన్‌గా కనిపిస్తే సినిమాకు మరో లెవెల్ ఇంపాక్ట్ వస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రధానంగా ఉండబోతున్నాయి. డైరెక్టర్ బాబీ ఇప్పటికే చిరంజీవిని “వాల్తేరు వీరయ్య”లో మాస్, కామెడీ మిక్స్ రోల్‌లో చూపించి పెద్ద సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన చిరును కొత్త లుక్, కొత్త అటిట్యూడ్‌తో చూపించబోతున్నాడట.
ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. నవంబర్ చివరి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని, ఫస్ట్ షెడ్యూల్‌లో చిరు, అనురాగ్ కశ్యప్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని తెలుస్తోంది. విలన్‌గా అనురాగ్ ఎంట్రీతో “మెగా 158”కు మరో లెవెల్ హైప్ వచ్చేసింది.
