Site icon NTV Telugu

Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Revanth Reddy

Chiranjeevi Revanth Reddy

Chiranjeevi Meets CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మెగాస్టార్‌ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డిని ఆయన జూబిలీహిల్స్ నివాసంలో చిరంజీవి కలిశారు. ఇక వీరి కలయికకు సంబంధించిన పొటోలు,వీడియో వైరల్‌గా మారాయి. నిజానికి రేవంత్‌రెడ్డిను సీఎంగా ప్రకటించిన తర్వాత చిరంజీవి అందరికంటే ముందుగా అభినందించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్ 7న సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కొత్త సీఎం రేవంత్‌కు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి అప్పుడే ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

RGV: ఆర్జీవీ వ్యూహం మూవీ పోస్టర్ల దగ్ధం.. డెన్ ఎదుట ఉద్రిక్తత

ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాభినందనలు. మీ నేతృత్వంలో ఇకపై రాష్ట్రం మరింతగా అభివృద్ధి పథంలో సాగాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను. డిప్యూటీ సీఎంగా నియమితులైన భట్టి విక్రమార్కకు, ఇతర మంత్రులందరికీ శుభాకాంక్షలు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక కొద్ది రోజుల క్రితమే దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు కొందరు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని కలిశారు. అయితే ఈ క్రమంలో సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా త్వరలో కల్పిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈలోపే చిరు వెళ్లి రేవంత్ ను కలవడం గమనార్హం.

Exit mobile version