Bhaje Vaayu Vegam: ఆసక్తి రేకెత్తించే “భజే వాయు వేగం” టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi launches Kartikeya Gummakonda’s “Bhaje Vaayu Vegam” racy teaser : ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న “భజే వాయు వేగం” సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. విశ్వంభర సినిమా సెట్ లో ఈ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ టీజర్ తో పాటు టైటిల్ ఇంట్రెస్టింగ్ గా, ఇంప్రెసివ్ గా ఉందని అన్నారు. “భజే వాయు వేగం” సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ నా అభిమాని హీరోగా ఓ మంచి సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా, “భజే వాయు వేగం” సినిమా టీజర్ చూస్తుంటే తండ్రీ కొడుకు మధ్య మంచి ఎమోషన్ తో సాగే సినిమా అనిపిస్తోంది. యాక్షన్ బాగుంది. ఈ సినిమా స్టోరీ నాకు తెలిసినా ఇంతకంటే ఎక్కువ లీక్ చేయాలనుకోవడం లేదు అని అన్నారు.
Salman khan: సల్మాన్ ఇంటిపై కాల్పులకు ముందే బెదిరింపు కాల్.. కానీ?
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ఇక “భజే వాయు వేగం” సినిమా టీజర్ సంగతి చూస్తే – డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభిస్తారు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇదే టాస్క్ మీద ఫోకస్ చేయగా మరోవైపు కార్తికేయ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూనే తండ్రితో ఆయనకున్న ఎమోషనల్ బాండింగ్ ను చూపించారు. ఇక రాహుల్ టైసన్ క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకడుంటాడు. వాడి కోసం ఏం చేయడానికైనా మనం వెనకాడం, నా లైఫ్ లో అది మా నాన్న అని కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఫాదర్, సన్ ఎమోషన్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు టీజర్ కు హైలైట్ గా నిలిచాయి. ఇక “భజే వాయు వేగం” సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!