NTV Telugu Site icon

Anasuya: అనసూయకు సారీ చెప్పిన చిరు.. ఎందుకంటే..?

Anasuya

Anasuya

Anasuya: ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. జబర్దస్త్ షోను కూడా మానేసి పూర్తి సమయం నటనకే కేటాయిస్తోంది. ఇక అనసూయ ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తోంది. చిరు నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ బిజీగా మారారు. అయితే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో అనుసూయకు సారీ చెప్పారు చిరు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందాన్ని అందరి గురించి పేరు పేరునా మాట్లాడిన చిరు.. అనసూయ గురించి చెప్పడం మర్చిపోయారు. ఇక అయితే నా పేరు ఎందుకు చెప్పలేదంటూ అనసూయ ఫోన్ చేసి మరీ అడిగిందట.

ఇక ఈ ప్రెస్ మీట్ లో అనసూయ గురించి చిరు మాట్లాడుతూ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలామందిని మర్చిపోయాను అందులో ఆర్ట్ డైరెక్టర్ సురేష్, ఇక తన పేరు చెప్పలేదని ఒక్క అమ్మాయి అలిగింది.. అనసూయ.. సారీ అమ్మా మర్చిపోయాను..ఇప్పుడు చెప్తున్నాను అనసూయ మంచి పాత్ర చేసింది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మరోపక్క అనసూయ స్వీట్ గా అలిగినా మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు జోరున వర్షం.. ఆ వర్షంలోనే చిరు తడుస్తూ స్పీచ్ ఇచ్చాడు. అలాంటి సమయంలో అంతమందిని ఎలా గుర్తుపెట్టుకుంటారు. ఆయన త్వరగా స్పీచ్ ముగించి ఇంటికి వెళ్లాలని అభిమానులు కోరుకుంటుంటే మీ పేరు చెప్పలేదని బాధపడుతున్నారా..? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆమె ఏదో సరదాకు అని ఉంటారు.. అది చిరు స్టేజి మీద చెప్పారు దానికెందుకు అంత సీరియస్ అవుతున్నారని మరికొందరు అంటున్నారు.

Show comments