NTV Telugu Site icon

Chiranjeevi: నా తప్పు లేదు.. ఎట్టకేలకు గరికపాటి వివాదంపై స్పందించిన చిరు

Chiru

Chiru

Chiranjeevi: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది గరికపాటి- చిరు మధ్య వివాదం. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరుపై గరికపాటి నరసింహారావు ఫైర్ అయిన విషయం విదితమే.. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. విమర్శలు, ట్రోల్స్ అబ్బో ఒకటి ఏమిటి సినీ, రాజకీయ రంగాల్లో ఈ ఘటన సెన్సేషనల్ గా మారింది. మెగా ఫ్యాన్స్ అందరు గరికపాటిని గరికతో సమానంగా తీసిపారేశారు. ఇక ఇంత జరుగుతున్నా చిరు మాత్రం నోరుమెదపలేదు. అయితే ఆ సమయం వచ్చింది. ఎట్టకేలకు చిరు ఈ వివాదంపై నోరు విప్పాడు. తన తప్పుడు లేదు కాబట్టి ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. తనకు తెలిసి తాను తప్పు చేయను అని తెలిపాడు.

ఒక ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ “సంయమనం పాటిస్తే నిజానిజాలు నిలకడమీద బయటకొస్తాయి. నేను తప్పు చేయను.. ఒకవేళ తప్పు చేస్తే పొరపాటు అయ్యిందని ఒప్పుకుంటా.. నీ తప్పు లేకుండా ఆరోపణ చేస్తే.. వెంటనే ఢీకొట్టాల్సిన అవసరం లేదు. నిజం నిలకడపై తెలుస్తుంది అన్నది.. నేను పూర్తిగా నమ్ముతా.. అలా నమ్మాను కాబట్టే బ్లడ్ బ్యాంక్ మీద..రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, భూ కబ్జా చేశాను అన్నప్పుడు స్పందించలేదు. నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు ఉలిక్కిపడాలి. నా మీద నిందలు వేసినవారే తప్పు తెలుసుకొని నాకు సరెండర్ అయ్యారు. కోర్టు ద్వారానో, అంతరాత్మ ద్వారానో నిజం తెలుసుకున్నారు. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెంచానన్నది ముఖ్యం కాదు.. నా హృదయానికి ఎంత మందిని దగ్గరగా తీసుకున్నా అన్నది ముఖ్యం. ఎద్దేవా చేసినవారు దగ్గరకు వస్తే నేను ఆలింగనం చేసుకున్నా.. ఇదే నాకు తెలిసిన ఫిలాసఫీ.. అలా చేసి ఎక్కువ మంది మనస్సులను తెలుసుకున్నా.. నేను తప్పు చేయనని నా గట్టి నమ్మకం..నా తప్పు ఉంటే అందరికంటే నేనే ముందుకు వస్తా.. ఒకానొక సమయంలో నేను రాజకీయాల్లోకి వస్తానంటే విమర్శించిన వాళ్లు నాపై రాళ్లు విసిరారు.. ఆ విషయం తెలుసుకుని వాళ్ల ఇంటికి వెళ్లా.. నా తప్పు లేదు కాబట్టే వాళ్ల ఇంటికి వెళ్లా..నా ఫ్యాన్స్ తప్పు చేసినా వాళ్ల ఇంటికి వెళ్లి క్షమాపణ కోరాను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.