Site icon NTV Telugu

Ram Charan : చరణ్ మైనపు విగ్రహంతో చిరంజీవి ఫ్యామిలీ..

Ram Charan

Ram Charan

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. అతని మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొన్న విగ్రహం ఆవిష్కరణకు చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ, ఉపాసన, క్లీంకార ఈ వేడుకకు హాజరయ్యారు. చరణ్‌, అతని పెట్ డాగ్ ను కలిపేసి మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. రామ్ చరణ్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఆవిష్కరణ రోజు పెద్దగా ఫొటోలు ఏవీ బయటకు రాలేదు. ఫ్యాన్స్ కొందరు తీసిన పిక్స్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ అందులో కూడా రామ్ చరణ్‌ ఒక్కడే కనిపించాడు. తాజాగా చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కలిసి రామ్ చరణ్‌ మైనపు విగ్రహంతో దిగిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Home Minister Anitha: అధికారులపై హోంమంత్రి అనిత సీరియస్‌.. చర్యలు తప్పవని వార్నింగ్..

సోఫాలో రామ్ చరణ్‌ తన పెట్ డాగ్ తో కూర్చుని ఉన్నట్టు మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహంతో చిరంజీవి, రామ్ చరణ్‌, సురేఖ, ఉపాసన కలిసి పిక్స్ దిగారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ అందరూ ఈ ఫొటోలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్‌ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా టాలీవుడ్ నుంచి ముగ్గురే ఈ ఫీట్ అందుకున్నారు. మున్ముందు మరింత మంది హీరోలు ఈ ఫీట్ అందుకుంటారేమో చూడాలి.

Read Also : Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Exit mobile version