Light and Sound Show at Golconda Fort: ఈ రోజు నుంచి చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులతో కనువిందు చేయబోతుంది. పర్యాటకులను పెంచడమే లక్ష్యంగా రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా, ఈ కోట చరిత్రను తెలిపేలా సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరు అయిన ఈ వేడుకలో లైట్ షోను ప్రారంభించారు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారత దేశ చలన చిత్ర వైపు చూస్తున్నాయని, విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి లాంటి వాళ్ళు అంతర్జాతీయ స్థాయి సినిమాలు చేస్తున్నారని అన్నారు. వెయ్యి పదాలు చెప్పలేని దాన్ని ఒక దృశ్యం చెబుతుందని భవిష్యత్ తరాలకు చెప్పేందుకు కలర్ ఫుల్ గా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లైట్ అండ్ లేజర్ షో ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయిలో ఉమ్మడి ఎపీని టూరిజం లో నెంబర్ గా నిలబెట్టానని అన్నారు.
Kurchi Tatha: గుంటూరు కారం కుర్చీ తాత అరెస్ట్.. మహేష్ బాబు వల్లనే అంటూ ప్రచారం… అసలు విషయం ఏంటంటే
ఇక విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారత పర్యాటక శాఖ అభివృద్ధి చెందాలని, గోల్కొండలో శ్రీ రామదాసు రాముడిపై పాటలు పాడారు, ఆయన బాధలు చూడలేక స్వయంగా శ్రీరామచంద్రుడు తనీషా దగ్గరకు వచ్చి బాకీ చెల్లించి రామదాసును విడిపించారు. అయోధ్యలో రాముడికి బలరాముడు కట్టిన గుడిని బాబర్ నాశనం చేస్తే 700 ఏళ్లుగా ఆయన గుడి లేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చతురస్ర రాశుల సృష్టి కర్త అయిన రాముడు తన గుడిని తను నిర్మించుకోలేడా? కానీ భక్తులకు ఆ అవకాశం ఇచ్చారని అన్నారు. ఎంత మంది త్యాగాల ఫలితంగా అయోధ్యలో రాముడి గుడి రూపుదిద్దికుందని, 2 రోజుల రోజుల క్రితం అయోధ్యలో రాముడి గుడికి మోడీ ప్రాణ ప్రతిష్ట చేశారని అన్నారు. ఆ క్షణంలో శ్రీ రామదాసు పాడిన జగమంతా రామమయం పాటతో దేశమంతా మారుమోగిందని అలాంటి పాట పుట్టిన చోట అద్భుతమైన లేజర్ షో జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ షోను వీక్షించడానికి నేను కూడా చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నానని అన్నారు.