NTV Telugu Site icon

Chiranjeevi : ఏంటీ .. ఇంకో రీమేకా.. అన్నా నీకు దండం పెడతామే..?

Chiru

Chiru

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కోలీవుడ్ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ మెహర్ రమేష్. ఈచిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చెల్లెలిగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత చిరు.. కుర్రడైరెక్టర్ల కథలను ఓకే చేసే పనిలో పడ్డాడని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే కుర్ర డైరెక్టర్లు తమ కథలతో.. చిరును మెప్పించే పనిలో ఉన్నారట. ఇక ఈ నేపథ్యంలోనే చిరు.. ఇంకో రీమేక్ మీద కన్నేశాడని వార్తలు వస్తున్నాయి. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా బ్రో డాడీ. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది ఓటిటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను చిరు.. రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కథ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది.

Naga Chaitanya: మీరందరు నా కస్టడీలోకి వస్తారు.. అది పక్కా

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రి కొడుకులు. పృథ్వీరాజ్ తన స్నేహితురాలు అయిన కళ్యాణితో సహజీవనం చేస్తూ ఉంటాడు. ఇక ఒకేసారి పృథ్వీరాజ్ భార్య, తల్లి ప్రెగ్నెంట్ అవుతారు. ఒకరికి బ్రో, ఇంకొకరికి డాడీ అవుతాడు. లేట్ వయస్సులో తన తల్లి ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది..? ఆ తరువాత తండ్రీకొడుకులు ఎలా ఈ విషయాన్ని సరిదిద్దారు అనేది కథ. ఈ కథలో చిరు నటిస్తున్నాడుఅంటే అభిమానులు ఊరుకుంటారా..? అనేది ప్రశ్న. ఇక ఈ రీమేక్ లపై చిరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గాడ్ ఫాదర్ రీమేక్, భోళా శంకర్ రీమేక్.. మళ్లీ ఈ రీమేక్ అని తెలియడంతో.. అభిమానులు అన్నా నీకు దండం పెడతామే.. ఈ రీమేక్ లు ఆపేయ్ .. ప్లీజ్ అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments