NTV Telugu Site icon

Chiranjeevi : చిరంజీవితో అలాంటి సినిమా తీయబోతున్న అనిల్..

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రూటు మార్చేస్తున్నారు. భోళాశంకర్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తూ.. కథల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు అనిల్ రావిపూడితో మరో సినిమా తీయబోతున్నారు. అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే కామెడీకి కేరాఫ్‌ అడ్రస్ లాగా ఉంటాయి. పైగా చిరంజీవి సినిమా అంటే కచ్చితంగా లవ్ ట్రాక్స్, డ్యూయెట్ సాంగ్స్ ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం చిరంజీవితో ఓ హుందా పరమైన సినిమా తీయబోతున్నాడంట.

Read Also : Betting App Promotions: ఈడీకి చేరిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం

చిరంజీవి వయసుకు తగ్గట్టు ఫ్యామిలీ మ్యాన్ లాగా చూపించబోతున్నాడని తెలుస్తోంది. అలాగే ఇంద్ర సినిమాను గుర్తు చేసేలా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కథను రెడీ చేసుకుంటున్నాడంట. ఇందులో చిరంజీవి పాత్ర చాలా పవర్ ఫుల్ గా, హుందాగా ఉంటుందని సమాచారం. అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు చేయని వైవిధ్యమైన పాత్రలో చేయాలని చిరంజీవి భావిస్తున్నాడంట. అందుకు తగ్గట్టే కథను డెవలప్ చేస్తున్నాడంట అనిల్.