NTV Telugu Site icon

Chiranjeevi: ఎన్టీఆర్ ఇచ్చిన చాలా సలహాలు నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్నాయి

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi about NTR Advices to him in Early Carrier: విశాఖపట్నం ఋషి కొండలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏ ఎన్ ఆర్ శత జయంతి కార్యక్రమాన్ని లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎదుగుతున్న సమయంలో ఆయన కొన్ని సలహాలు నాకు ఇచ్చారు. ముందు సంపాదించిన సంపద అంతా ఇనుప ముక్కల మీద పెట్టవద్దు ఏదైనా మంచి ఇల్లు కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టుబడి పెట్టండి మనల్ని కాపాడేది అదే అన్నారు. మనం ఇక్కడ ఇలాగే ఉంటాం. ఇదే సూపర్ స్టార్ డంతో ఉంటాం అని ఇది శాశ్వతం అని అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో ఎంతో ముందు జాగ్రత్తతో ఇచ్చిన సలహా ఇది.

Chiranjeevi: ఎన్టీఆర్ ను చూస్తే ఏఎన్నార్ కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్.. అప్పటి రహస్యాలు బయటపెట్టిన చిరంజీవి

నిజానికి అప్పటి దాకా మంచి కారు కొనుక్కుందామని అనుకునేవాడిని. అప్పట్లో టయోటా సెరా అని తలుపులు పైకి తెరుచుకునే కారు ఒకటి ఉండేది. వింగ్ టాప్ లాగా ఉండే ఆ కారు అప్పట్లో చాలా ఫ్యాన్సీ. అలాంటి కార్లు కొనుక్కుందామా? టయోటాలో ఇంకా వేరే రకాలైన కార్లు కొనుక్కుందామా అనుకునే వాడిని. కానీ ఆయన సలహా విన్న తర్వాత అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలు పెట్టాను. ఈ రోజు నా రెమ్యునరేషన్ కంటే ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీ ని కాపాడుతున్నాయి. అలాంటి గొప్ప సలహా ఇచ్చిన మహానుభావుడు ఎంతో దూర ద్రుష్టి గలవారని చిరంజీవి పేర్కొన్నారు.