NTV Telugu Site icon

Indian 2: కమల్ కే షాక్ ఇచ్చిన ఎయిర్పోర్ట్ సిబ్బంది… షూటింగ్ నే ఆపేసారు

Kamal Haasan

Kamal Haasan

రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కమల్ హాసన్ ‘సేనాపతి’ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. అవినీతిపైన పోరాడే ఈ క్యారెక్టర్ ని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేసారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… శంకర్-కమల్ హాసన్ లు ఇండియన్ 2ని గ్రాండ్ గా అనౌన్స్ చేసారు. సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ తో బెంగాల్ లో షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు. ఆ తర్వాత బడ్జెట్ లు అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతూ ఉండడం, లొకేషన్ లో ఒక యాక్సిడెంట్ జరగడం… ఇలా కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో, అన్ని కారణాలు ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఆగిపోవడానికి కూడా ఉన్నాయి. ఇండియన్ 2 సినిమాని వదిలేసి శంకర్, రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా కూడా స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ ని చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఉన్నట్లుండి ఇండియన్ 2 లైమ్ లైట్ లోకి వచ్చింది.

ఎన్నో మంతనాలు, రెడ్ జెయింట్ ఇన్వాల్వ్మెంట్ తర్వాత అన్ని సమస్యలు సాల్వ్ అయ్యి గతేడాది సెప్టెంబర్‌లో ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ మళ్లీ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుండి ఇండియన్ 2 షూటింగ్‌ బ్రేక్ లేకుండా జరుగుతూనే ఉంది. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా యూనిట్ కి చెన్నై ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా షూటింగ్ నే ఆపేసేలా చేసారు. చెన్నై విమానాశ్రయంలో ఓ హ్యూజ్ సీక్వెన్స్ ని కమల్ పైన శంకర్ షూట్ చేస్తుండగా ఏయిర్‌పోర్ట్‌ నిర్వాహాకులు షూటింగ్‌ను మధ్యలోనే ఆపేశారట.  ఏయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాలు, డిపార్చర్‌ ఏరియాలో షూటింగ్‌ చేసుకోవడానికి మాత్రమే పర్మీషన్ తీసుకోని లావటరీ ఏరియాలో షూటింగ్‌ చేస్తుండడంతో షూటింగ్ ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. పర్మీషన్‌ లేకుండా షూట్ చేస్తుండడంతో ఇండియన్ 2 చిత్ర యూనిట్ కి ఈ పరిస్థితి ఎదురయ్యింది. కమల్ హాసన్ సినిమా షూటింగ్ ని చెన్నైలోనే అడ్డుకోవడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Show comments