Rathnam: ‘చెబుతావా’ అంటున్న ప్రియా భవాని శంకర్…దేవిశ్రీ ప్రసాద్ మెలోడీ భలే ఉంది బాసూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chebuthaava Lyrical Video: త్వరలో హీరో విశాల్ రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రత్నం సినిమాలో విశాల్‌కి జోడిగా ప్రియా భవాని శంకర్ నటించింది. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మిస్తుండగా కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండడంతో రత్నం మీద మంచి హైప్ ఏర్పడింది. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కె రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి ఆదరణను దక్కించుకున్నట్టు వెల్లడించింది.
Sahkutumbanaam: “సఃకుటుంబానాం” అంటున్న రాజేంద్ర ప్రసాద్ అండ్ కో!
Also Read
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
- Srikanth Odela: "అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!"
- The Paradise: 'పెద్ది' రిజల్ట్ చూశాక కూడా 'ది పారడైజ్' పాఠాలు నేర్వలేదా?
ఇక ఈ మధ్యనే ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టు మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో వేగం పెంచగా తాజాగా ఈ సినిమా నుంచి మంచి మెలోడియస్, ఎమోషనల్ సాంగ్ ‘చెబుతావా’ని రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం, సింధూరి విశాల్ గాత్రాన్ని అందించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీ ఎంతో వినసొంపుగా ఉందని చెప్పాలి. ఇక ఈ మూవీకి ఎం సుకుమార్ కెమెరామెన్‌గా, టీ ఎస్ జై ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఇక ఇంకెందుకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ సాంగ్ మీరూ వినేయండి.
తాజావార్తలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?