Site icon NTV Telugu

Sai Surya developers: మహేష్ బాబు ప్రమోట్ చేసిన సాయి సూర్య డెవలపర్స్ పై చీటింగ్ కేసు?

Sai Surya Developers

Sai Surya Developers

Case filed on Sai Surya developers: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ పై కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లోని వెంగల్‌రావు నగర్‌ కేంద్రంగా నడుస్తున్న ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తపై 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాజాగా చీటింగ్ కేసు నమోదు చేశారు. మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ప్రకారం.. నక్క విష్ణు వర్ధన్ అనే వ్యక్తి తన సన్నిహితులు అయిన కొంత మందితో కలిసి సాయి సూర్య డెవలపర్స్ గ్రీన్ మెడోస్ వెంచర్‌లో మూడు కోట్ల 21 లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఏప్రిల్ 2021లో షాద్‌నగర్‌లో 14 ఎకరాల భూమి మీద ఈ పెట్టుబడి పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ వెంచర్‌లో నక్క విష్ణు వర్ధన్ అండ్ కోతో పాటు డాక్టర్ సుధాకర్ రావు, శ్రీకాకుళం విటల్ మహేష్, రాజేష్, శ్రీనాథ్, కె హరీష్, కోట్ల శశాంక్, సిహెచ్ రవి కుమార్, కె ప్రభావతి, వెంకట్ రావు, కృష్ణ మోహన్ కూడా పెట్టుబడులు పెట్టారు. షాద్‌నగర్‌లో వ్యవసాయేతర భూమి), తనఖా ప్లాట్‌ల పేరుతో ఈ ఒప్పందం జరిగింది.

Priyanka Jawalkar: సెల్ఫీ గేమ్ అంటూ రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. క్లీవేజ్ షోతో ప్రియాంక ట్రీట్

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) నుండి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ప్లాట్‌లను రిజిస్టర్ చేస్తామని హామీ ఇవ్వడంతో పెట్టుబడి పెట్టినట్టు విష్ణు వర్ధన్ అండ్ కో చెడుతున్నారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ, కంపెనీ నుండి సరైన సమాచారం లేకపోవడం వల్ల పెట్టుబడి పెట్టిన అందరు పెట్టుబడిదారులకు అనుమానం పెరిగింది. రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖలో విచారణ నిర్వహించగా, నక్కా విష్ణు వర్ధన్ అండ్ కోకి ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేమంటే వారి పెట్టుబడికి సంబంధించిన అన్ని మార్ట్‌గేజ్ ప్లాట్‌లు వారికి తెలియకుండా SRV & TNR ఇన్‌ఫ్రా-రాజారామ్ & VASGI వెంకటేష్ అనే ఫైనాన్షియర్‌ల పేర్ల మీదకు వెళ్లిపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. సాయి సూర్య డెవలపర్స్ కి మంచి ఇమేజ్ ఉందని, సినీ నటుడు మహేష్ బాబు లాంటి వ్యక్తులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడంతో ఎటువంటి మోసం జరగదు అని భావించి కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నారు. అయితే, ప్రాజెక్ట్ సైట్ కి వెళ్లి చూస్తే అసలు అభివృద్ధి జరగలేదని, అవసరమైన అనుమతులు ఆశించిన విధంగా పొందలేదని తేలి ఈ అంశం మీద మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 406, 420 కింద నిందితులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, మోసం చేశారని చెబుతూ కేసు నమోదు చేశారు.

Exit mobile version