ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ తమిళ నటుడు ఆర్యపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమా షూటింగ్ నిమిత్తం అద్దెకు తీసుకున్న అత్యాధునిక కెమెరాలు, లైటింగ్ పరికరాలకు సంబంధించిన రూ. 1.80 కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారంటూ సదరు సంస్థ పోలీసులను ఆశ్రయించింది.పోలీసుల కథనం ప్రకారం.. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న ‘అనంతన్ కాడు’ అనే మలయాళ చిత్ర చిత్రీకరణ కోసం గతేడాది ఫిబ్రవరిలో చిత్రబృందం జూబ్లీహిల్స్ వెంకటగిరి పరిధిలోని హైలాంకాలనీకి చెందిన ‘తాహెర్ సినీ టెక్నిక్’ సంస్థ నుండి షూటింగ్ కోసం డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లను అద్దెకు తీసుకున్నారు.
దీంతో సదరు సంస్థ తన స్వంత ఖర్చులతో షూటింగ్ పరికరాలను హైదరాబాద్ నుండి కేరళలోని షూటింగ్ కు తరలించింది. మొత్తం రూ. 2.12 కోట్ల అద్దెకు గానూ.. షూటింగ్ పూర్తయిన తర్వాత మెజారిటీ వాటా అయిన రూ. 1.80 కోట్లకు పైగా బకాయిలను నటుడు ఆర్య, నిర్మాత వినోద్ చెల్లించలేదు. సినిమా విడుదలకు ముందే మొత్తం బకాయిలు చెల్లించి ‘నో డ్యూస్ సర్టిఫికేట్’ తీసుకుంటామని లిఖితపూర్వకంగా అంగీకరించినప్పటికీ, చిత్రబృందం ఆ మాట నిలబెట్టుకోలేదని బాధితులు పేర్కొన్నారు. బకాయిల చెల్లింపు విషయమై పలుమార్లు ఫోన్ కాల్స్, వాట్సప్ సందేశాల ద్వారా సంప్రదించినా స్పందించలేదని, పైగా బాకీ డబ్బులు అడిగిన తమ సంస్థ మేనేజర్‌ను నటుడు ఆర్య, నిర్మాత వినోద్, ఆర్య వ్యక్తిగత సహాయకుడు కిశోర్ కలిసి బెదిరింపులకు గురిచేశారని సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ తన ఫిర్యాదులో ఆరోపించారు. వాస్తవాలను కప్పిపుచ్చి కేరళలోని న్యాయస్థానం నుండి వీరు మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read
- Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
తాజావార్తలు
-
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!