Site icon NTV Telugu

Cheater Trailer: ఆసక్తి రేపుతున్న “చీటర్” ట్రైలర్

Cheater Movie Trailer

Cheater Movie Trailer

Cheater Movie Trailer : చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా ప్రేక్షకులు ఎలాంటి సినిమా అయినా నచ్చితే ఆదరిస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు చీటర్ అనే సినిమా రాబోతోంది. చంద్రకాంత్ దత్త, నరేందర్ హీరోలుగా, రేఖ నిరోషా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాధిక,అనిత,మల్లేశం, నిషాన్, గౌటి రాజు ఇతర కీలక పాత్రలలో నటించారు. డిఓపిగా గోవింద్ బాబు చర్ల వ్యవహరించిన ఈ సినిమాకి అర్జున్ సంగీతం అందించారు. ఎస్.ఆర్.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పరుపాటి శ్రీనివాసరెడ్డి నిర్మాతగా, బర్ల నారాయణ దర్శకత్వంలో ఈ చీటర్ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోవడమే కాక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని సెప్టెంబర్ 22వ తేదీన విడుదల ఎందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే వన్ మిలియన్ న్యూస్ దాటేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులలో సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తోంది.

Singham Again: సింగం వీరులు మళ్ళీ మొదలెట్టారు!

ఇక ఈ క్రమంలోనే నిర్మాత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాము అనుకున్నట్లుగానే సినిమా అవుట్ ఫుట్ కూడా వచ్చిందని డైరెక్టర్ కూడా ఎక్కడ తగ్గకుండా కష్టపడి పనిచేసి సినిమాకి మంచి అవుట్ పుట్ తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. మా సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్న ఆయన ఇప్పటికే 12 లక్షల మందికి పైగా మా ట్రైలర్ చూశారని వారందరికీ నచ్చిందని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతున్న తమ సినిమాని కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ సస్పెన్స్ రేకెత్తించే విధంగా థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా మా సినిమా ఉంటుంది అని అన్నారు. తమ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ముఖ్యంగా అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని ఆయన కోరారు.

Exit mobile version