Site icon NTV Telugu

Indra Ram : చౌర్యపాఠం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

Indraram

Indraram

ధమాకా, మజాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తొలి సారిగా నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ‘చౌర్య పాఠం’. క్రైమ్-కామెడీ డ్రామాగా తెరెకెక్కుతోన్న ఈ చిత్రంతో ఇంద్రా రామ్‌ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కన్నడ భామ పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. నిఖిల్ గొల్లమారి అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. రాజీవ్ కనకాల, మస్త్ అలీ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ నుంచి గతంలో  సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ధనపల్లి అనే గ్రామంలో బ్యాంక్ దొంగతనం చేయాలని భావించే ఓ ముఠాకు ఆ క్రమంలో ఎదురైన పాఠమే చౌర్యపాఠం. ట్రైలర్ ను ఆద్యంతం కామెడి తో పాటు కథను లైటర్ వీన్ లో ఆడియెన్స్ కు అర్ధం అయ్యే రీతిలో కట్ చేసారు. లీడ్ క్యారక్టర్ చేసిన ఇంద్రరామ్ మొదటి సినిమా అయిన చక్కటి హవాభావాలు, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. డేవ్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాల బాగుంది. ఖర్చు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఒక సరికొత్త కథాశంతో నూతన నటీనటులతో వస్తున్న చౌర్యపాఠం ఈ నెల 25న వరల్డ్ వైడ్ గాతెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ కానుంది.

Exit mobile version