Site icon NTV Telugu

Tollywood Cricket Association : చారిటీ క్రికెట్ మ్యాచ్ కు రంగం సిద్ధం

Tollywood Cricket Association

Tollywood Cricket Association

ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా సారథ్యంలో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) సహకారంతో ఓ చారిటీ క్రికెట్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పేద పిల్లలకు సహాయాన్ని అందించడమే కాకుండా చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ వంటి కార్యక్రమాలతో సామాజిక సేవ చేస్తున్నారు. అయితే తాజాగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా వారు ఆడియన్స్ (ఫ్యాన్స్) కు విన్నూమైన కాన్సెప్ట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలతో క్రికెట్ ఆడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. హీరోలతో క్రికెట్ ఆడాలని అనుకున్న వారు బిడ్డింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అందులో విన్ అయిన వారు యూనివర్సల్ XL జట్టులో సభ్యులు అవుతారు. ఆ తరువాత అమెరికాలోని డల్లాస్ లో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA)తో బిడ్డింగ్ ద్వారా సెలెక్ట్ అయిన యూనివర్సల్ XL టీం పోటీపడుతుంది.ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని చారిటీకి డొనేట్ చేస్తారు.

Read Also : Mahesh Babu : సితార ఫస్ట్ కూచిపూడి డ్యాన్స్… వీడియోతో మహేష్ శ్రీరామ నవమి విషెస్

ఈస్ట్ వెస్ట్ ఏంటర్టైన్మెంట్ & ఎలైట్ సంస్థలు శనివారం హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ జట్టు సభ్యులు తమన్, సుధీర్ బాబు, ప్రిన్స్, భూపాల్ తో పాటు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సీఈవో రాజీవ్ అండ్ టీం, ఎలైట్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. ఇది టాలీవుడ్ సెలెబ్రెటీస్ VS ఫ్యాన్స్… ఆన్ లైన్ లో బిడ్ చేసి విన్ అయ్యి సెప్టెంబర్ 24 న డల్లాస్ లో జరిగే మ్యాచ్ లో అడచ్చు. టాలీవుడ్ క్రికెట్ టీంలో కెప్టెన్ శ్రీకాంత్ , వైస్ కెప్టెన్ తరుణ్, తమన్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, నిఖిల్, శర్వానంద్, నాని, ప్రిన్స్, భూపాల్, అల్లరి నరేష్ ఉండగా, ఇంకా కొంతమందిని త్వరలో అనౌన్స్ చేయనున్నారు. అలాగే సునీల్ తో పాటు పలువురు హీరోయిన్లు కూడా ఈ ఈవెంట్ లో హాజరు కాబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాల కోసం www east west entertainment.comను సందర్శించండి.

Tca

Tca1

Exit mobile version