Senior Heroine Seetha: టాలీవుడ్ సీనియర్ నటి సీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె రీ ఎంట్రిలోనూ అదరగొట్టింది. గంగోత్రిలో అల్లు అర్జున్ తల్లిగా సింహాద్రిలో ఎన్టీఆర్ అత్తగా నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో పలు సీరియళ్లలో నటిస్తున్న ఈ భామ తాజాగా ఒక ఫోటోషూట్ తో షాక్ ఇచ్చింది. మోడ్రన్ చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది. ఎప్పుడు చీరకట్టు, నుదుటిన పెద్దబొట్టుతో కనిపించే సీత.. ఈ ఫోటోషూట్ లో డిజైనర్ శారీ, అందుకు తగ్గ హెయిర్ స్టైల్ తో పది ఇరవై సంవత్సరాల వయసు తగ్గినట్లు కనిపించింది.
ఇక సీత షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. ఆమె సీతనేనా లేక ఆమె కూతురా..? అంటూ కామెంట్స్ పెట్టుకొస్తున్నారు. నటిగా సీత ఎన్నో సార్లు అలరించింది.. ఆశ్చర్యపర్చింది. అయితే మొదటి సారి ఇలా తన లుక్ తో సీత సర్ ప్రైజ్ చేయడం ఆశ్చర్యంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ ఫోటోషూట్ దేనికోసం చేసిందో తెలియదు కానీ.. ఒక్క ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మాత్రం మారిపోయింది. దీనివలన ఈ భామకు అవకాశాలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఎలాంటి ఛాన్సులు సీత పట్టేస్తోందో చూడాలి.
