సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడకి వచ్చేవారు సక్సెస్ అయ్యేవరకు ఎన్నో అవమానాలను ఎదుర్కోక తప్పదు. మరుముఖ్యంగా హీరోయిన్లు.. మహిళా కళాకారులు క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కోక మానరు. ఏదో ఒక సందర్భంలో వారు అనుభవించిన చేదు అనుభవాలను ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ నటి ప్రగతి కూడా కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ విషయాలను బయటపెట్టిందని, ఒక స్టార్ హీరో తనను లైంగికంగా వేధించాడని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మ అత్త పాత్రల్లో నటిస్తూ బిజీగా వున్న ప్రగతి అస్సలు ఆ ఇంటర్వ్యూ లో ఏమని చెప్పుకొచ్చిందంటే..”నేను కెరీర్ ని ప్రారంభించినప్పుడు అవకాశాల కోసం దర్శక, నిర్మాతల వద్దకు వెళ్ళినప్పుడు వారు ఒక రాత్రి గడిపితే అవకాశం దక్కుతుందని చెప్పుకొచ్చేవారు.
అవకాశాల కోసం దర్శక నిర్మాతలే కాకుండా ఓ హీరో కూడా నన్ను వేధించాడు. ఆ సినిమాలో అవకాశం కావాలంటే దర్శక నిర్మాతలతో పాటు తనతో కూడా గడపాలని కోరాడు. కానీ దేనికి నేను తల వంచలేదు. ఇండస్ట్రీలో చాలామంది మహిళా కళాకారులు ఇలాంటి వేధింపులనే ఎదుర్కొంటున్నారు. అయితే అవకాశాల కోసం తలవంచితే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ట్యాలెంట్ ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి” అని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉంది అనేది తెలియాల్సిఉంది. అయితే ఈ వార్త విన్నవారు ఆ స్టార్ హీరో ఎవరు అనేదాని మీద ఆరా తీస్తున్నారట.
