Virupaksha: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 21 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా మెప్పించి భారీ విజయాన్ని అందుకుంది. చేతబడులు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వందకోట్ల క్లబ్ లో కూడా చేరి.. తేజ్ రీఎంట్రీ లో భారీ హిట్ ను అందుకునేలా చేసింది. సుకుమార్ ఈ సినిమా యొక్క నిర్మాణ భాగస్వామిగా ఉన్న విషయం తెల్సిందే. అంతేకాకుండా తన శిష్యుడు కార్తీక్ కు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడట. తాజాగా ఓకే ఇంటర్వ్యూలో కార్తీక్ ఆ విషయాలను చెప్పుకొచ్చాడు. ముందు తాను రాసుకున్న కథ ఇది కాదని, ఆ కథ వినిపిస్తే సుకుమార్ అందులో కొన్ని చేంజెస్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక సుకుమార్ చెప్పినట్లు చేయడం వలనే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అందుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Sudhakar: నేను బ్రతికే ఉన్నాను… దయచేసి వాటిని నమ్మొద్దు
విరూపాక్షలో మెయిన్ విలన్ హీరోయిన్.. అయితే.. ముందు విలన్ గా కార్తీక్ , సంయుక్తను అనుకోలేదట.. తేజ్ అక్క శ్యామల అదే పార్వతీని అనుకోని సుకుమార్ కు చెప్తే.. పార్వతీ అయితే అంత ఇంపాక్ట్ ఉండదు. హీరోయిన్ ను విలన్ గా మార్చు అని సలహా ఇచ్చాడట. దీంతో ఆ మార్పులు చేర్పులు చేసి సినిమాను పూర్తిచేసినట్లు కార్తీక్ చెప్పుకొచ్చాడు. అలా మార్చడం వలనే సినిమాలో స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే వర్క్ అవుట్ అయ్యి ఇంత పెద్ద విజయాన్ని అందుకుంది. అన్నచెల్లెళ్లు.. తమ తల్లిదండ్రులను చంపిన ఊరుపై పగ తీర్చుకోవడానికి చేతబడులు నేర్చుకొని చివరికి వారే చనిపోతారు. ఆ ఊరిని కాపాడి.. హీరో విరూపాక్ష అవుతాడు. అది విరూపాక్ష కథ. ప్రస్తుతం కార్తీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.