Site icon NTV Telugu

Chandramukhi 2: చంద్రముఖిగా భయపెడతానంటున్న రాఘవ లారెన్స్..

Chandramukhi

Chandramukhi

కోలీవుడ్ దర్శకుడు పి. వాసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్రర్ సినిమాలైనా, భక్తి సినిమాలైనా ఆయనకు కొట్టిన పిండి. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమాను ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోలేడు. సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకొని రజినీ, ప్రభు, జ్యోతిక కెరీర్ లో బిగ్గెస్ట్ హాట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వెంకటేష్ తో ‘నాగవల్లి’ తీసి పరాజయం పాలయ్యాడు. ఒకరకంగా చెప్పాలంటే వెంకటేష్ సినీ కెరీర్ లోనే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక అన్ని భాషల్లోనూ చంద్రముఖి రీమేక్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా ఈ క్రేజీ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు పి.వాసు.

ఇక ఇందులో హర్రర్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ రాఘవ లారెన్స్ హీరోగా నటించడం విశేషం.. హర్రర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అంతేకాకుండా హరిహరవీరమల్లు లాంటి చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించిన తోట తరణి ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయనున్నారు. ఇక ఈ పోస్టర్ లో చంద్రముఖి తలుపును చూపించి మరింత ఆసక్తిని రేపారు. చంద్రముఖి పాత్రను పలు భాషల్లో పలువురు హీరోయిన్లు చేశారు. సౌందర్య, విమలా రామన్, జ్యోతిక, శోభన ఇలా పెద్ద పెద్ద స్టార్లు నటించి మెప్పించారు.. మరి ఈ చంద్రముఖి 2 లో ఆ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

Exit mobile version