Site icon NTV Telugu

Chandrahass: ‘మళ్లీ మళ్లీ’ వస్తానంటున్న యాటిట్యూడ్ స్టార్

Chandra

Chandra

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. ఇప్పటి వరకు ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

Also Read :2026 T20 World Cup: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ.. దెబ్బ అదుర్స్ కదూ!

ఈ క్రమంలో తాజాగా ‘మళ్లీ మళ్లీ’ పాటను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జి విడుదల చేసిన ఈ రొమాంటిక్ మెలోడియస్‌ పాటలో చంద్రహాస్, మేఘన కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది. ఇక ఇందులో ఆర్ఆర్ ధ్రువన్ ఇచ్చిన బాణీ ఎంతో శ్రావ్యంగా ఉంది. ఆర్ఆర్ ధ్రువన్ అందించిన సాహిత్యం, మహమ్మద్ ఇర్ఫాన్ గాత్రం ఎంతో వినసొంపుగా ఉన్నాయి. ఈ పాటను చూస్తే ఇట్టే ఆకట్టుకునే యుగళ గీతంగా కనిపిస్తోంది. జయంత్ సి పరాన్జి పాటను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ.. ”మళ్ళీ మళ్ళీ అంటూ సాగే ఈ పాట బాగుంది. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అందరూ చిత్రాన్ని చూసి ఆదరించండి. సినిమా టీంకి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

Exit mobile version