చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర వృత్తిరీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. వ్యాపార పనుల నిమిత్తం శనివారం అన్నమయ్య జిల్లాలోని కలికిరికి వెళ్లిన ఆయన, అక్కడ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం, ఒక హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఆకస్మిక మరణంతో చంద్రబోస్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. చంద్రబోస్ సోదరుడి మృతి వార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. సోదరుడిని కోల్పోయిన బాధలో ఉన్న చంద్రబోస్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
chandrabose: చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం..

Chandrabose Brother Death,