టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి చాందిని చౌదరి, కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక షాకింగ్ అనుభవాన్ని బయట పెట్టింది. తన తొలి రోజుల్లో కొన్ని సినిమా యూనిట్‌లు ఎలా ఒత్తిడులు తెస్తాయో, ఒక హీరోయిన్‌గా తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఆమె నిజాయితీగా షేర్ చేసింది. చాందిని మాట్లాడుతూ.. “కథ చెప్పినప్పుడు అసలు ముద్దు సీన్ల గురించి చెప్పలేదు. నేను కూడా ఓ కొత్త అమ్మాయి.. అది నా రెండో సినిమా టైమ్. కథ బాగుంది అనుకుని ఓకే చేశా. కానీ షూటింగ్ స్టేజ్‌కి వచ్చాక ఒక్కసారిగా కిస్ సీన్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు ‘అర్జున్ రెడ్డి’ కొత్తగానే రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ అయ్యింది. దాంతో మా సినిమా టీమ్‌కి కూడా అలాంటి సీన్లైతే సినిమాలో హైప్ పెరుగుతుందని అనిపించింది. ‘ఇది ఇప్పుడు ట్రెండ్.. ఇలా చేస్తే సినిమా బాగా పనిచేస్తుంది’ అంటూ నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు’ అని తెలిపింది.
Also Read : Deepika Padukone: రోజుకు 8 గంటలే పని – దీపిక నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!
అంతే కాదు ‘దర్శకుడు చెప్పినట్టు చేయకపోతే నేను అన్‌ప్రొఫెషనల్ అని చెబుతారేమో అనే భయం. సినీ ఇండస్ట్రీలో కొత్తగా ఉన్నప్పుడు అలాంటిది చాలా పెద్దది. ‘నటి మాట వినడం లేదు’, ‘అహంకారం పెరిగింది’ అని పేరు పెట్టేస్తారు కదా. అని భయం వేసింది. కానీ నా అదృష్టవశాత్తూ హీరో ముందే ఆ సీన్ చేయనని క్లియర్‌గా చెప్పేశాడు. అతను చెప్తాడు అనుకోలేదు. కాని అతని ‘నాకు కంఫర్ట్ కాదు’ అనే మాట వినగానే నేను పూర్తిగా ఊపిరి పీల్చుకున్న. లేకపోతే దీన్ని నేను బలవంతంగానే చేయాల్సి వచ్చేది. అందుకే ప్రజంట్ ఇప్పుడు నేను స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు ప్రతి సీన్ గురించి క్లియర్‌గా అడుగుతాను. చెప్పకుండా షూట్‌లో కొత్తగా అడిగితే నేను నో అంటాను. ఒక హీరోయిన్ కంఫర్ట్, కన్సెంట్ చాలా ముఖ్యం. ప్రేక్షకులు కంటెంట్ చూసే కాలం ఇది.. కేవలం కిస్ సీన్ కోసం సినిమా హిట్ అవదు” అని చెప్పింది. ఈ విషయాలు బయటకు రావడంతో చాందినీ కి మద్దతుగా సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. “అమ్మాయిలను బలవంతం చేసే ట్రెండ్‌కు ఆపేరు పెట్టాలి”, “హీరో చేసిన పని చాలా మంచిది” అనే రియాక్షన్లు వస్తున్నాయి.
